Read Time:33 Second

ప్రశ్న – ప్రగతి
మనిషి
ఆకలిని ప్రశ్నించాడు
ఆయుధం సృష్టించాడు
చీకటిని ప్రశ్నించాడు
నిప్పును కనిపెట్టాడు
గతిని గమనించాడు
చక్రం సాధించాడు
మానవ ప్రస్థానం
లెక్కకు మించిన
ప్రశ్నల సమాహారం
సైంటిస్ట్ ఎక్కడో లేడు
ప్రశ్న ఒడిలోనే
కొలువై వున్నాడు
ప్రశ్నను ప్రేమిస్తే...
ప్రగతి
నీ వశమవుతుంది
వి.రాజగోపాల్, విజయనగరం
Post Views: 74


Very good poetry