30పైగా శాస్త్ర ప్రచార సంస్థలతో అనుబంధం కలిగిన All India Peoples Science Network దేశవ్యాప్త శాస్త్ర ప్రచార వ్యాప్తి కోసం నవంబరు 7వ తేది (మన దేశానికి సైన్సు రంగంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన సి.వి.రామన్ జయంతి మరియు నోబెల్ బహుమతి సాధించిన మొదటి మహిళా మేరి క్యురీ జయంతి) నుండి జాతీయ సైన్స్ దినోత్సవం అయిన ఫిబ్రవరి 28వ తేది వరకు దేశవ్యాప్తంగా సైన్స్ కళాజాతాలు, సెమినార్లు, రౌండ్ టేబుల్స్, ప్రాముఖ్యాత కలిగిన తేదిలలో వివధ యూనివర్సిటిలు, కళాశాలలు, విద్యా సంస్థలు మరియు గ్రామాలలో అనేక మంది మేధావుల, వివిధ రంగాల నిష్ణాతులతో సహకారంతో శాస్త్ర ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎదురైనా అనేక అంశాలను, అనుభవాలను గమనించి శాస్త్రీయ దృక్పథ ఆవశ్యకతపై AIPSN ఒక ప్రకటనను ఫిబ్రవరి 28 తేదిన కోల్కతలో జరిగిన దేశవ్యాప్త శాస్త్ర ప్రచార ముగింపు కార్యక్రమంలో విడుదల చేసింది.


శాస్త్రీయ దృక్పథం పైన AIPSN ప్రచురించిన ప్రకటన ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన. అనువాదం చాలా బాగున్నది