సిరీస్
క్రీస్తు పూర్వము 260 నుండి నేటి వరకు సైన్సు మానవ జీవితాలను, ఈ విశ్వాన్ని చూసే దృక్పథాన్ని ప్రభావితం చేసింది… మార్చివేసింది.ఆనాటి నుండి సైన్స్ లో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. వాటిలో ఈనాటి ఈ అభివృద్ధికి బాటలు వేసిన ప్రముఖ ఆవిష్కరణలు …ఈ “ప్రపంచ గతినే మార్చి వేసిన ఆవిష్కరణలను” పరిచయం చేసుకుందాం.
- తులా దండాలు (LEVERS)…. ఉత్ప్లవనము (BUOYANCY)
భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకొనుటలో , నిర్వహించడంలో ప్ర ప్రధమ మానవ ఆవిష్కరణలుగా పై రెంటినీ పేర్కొన వచ్చును. మొత్తం ఇంజనీరింగ్ మరియు శాస్త్ర ప్రగతి ఈ రెండు ఆవిష్కరణలపై ఆధారపడి అభివృద్ధి చెందాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండిటినీ ఆవిష్కరించిన వారు “ఆర్కిమెడిస్” (ARCHIMEDES). క్రీస్తుపూర్వం 260లో వీటిని ఆవిష్కరించారు. ఆయన వీటిని ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం. మొదట తులా దండం గురించి……
